మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన వాల్మీకి సంఘం సభ్యులు
Views: 6
On
పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో శుక్రవారం బోయ నాగమ్మ మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న వెల్టూర్ వాల్మీకి మహర్షి సంఘం సభ్యులు వెంటనే స్పందించి, మృతురాలి కుటుంబానికి రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలు నాగమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ భర్త పెద్ద దాసుకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మల్లక్ సురేష్ కుమార్, శ్రీను, బోయ శేఖర్, బోయ కురుమూర్తి, బోయ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments