వనపర్తి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది నిజాయితీకి అభినందనలు
Views: 9
On
వనపర్తి,ఆగస్టు20(తెలంగాణముచ్చట్లు)
వనపర్తి 108 అంబులెన్స్ సిబ్బంది తమ నిజాయితీతో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. మంగళవారం రాత్రి రాజు అనే రోగిని వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించిన అనంతరం, బుధవారం ఉదయం వాహనాన్ని శుభ్రం చేస్తుండగా ఒక మొబైల్ ఫోన్ మరియు రూ.2500 నగదు దొరికాయి. అవి రోగి రాజుకు చెందినవని గుర్తించిన వెంటనే, ఆయన్ని సంప్రదించి వాటిని తిరిగి అందజేశారు.ఈ సందర్భంలో సేవా ధర్మాన్ని మాత్రమే కాకుండా నిజాయితీని కాపాడిన అంబులెన్స్ పైలట్ శ్రీనివాసులు మరియు ఈఎంటి బుద్వేష్ ను వనపర్తి జిల్లా 108 డిస్ట్రిక్ట్ మేనేజర్ మహబూబ్ అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments