వనపర్తి నల్ల చెరువును  ప్రజలకు నడక, వ్యాయామానికి అనుకూలంగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నల్ల చెరువును  ప్రజలకు నడక, వ్యాయామానికి అనుకూలంగా తీర్చిదిద్దాలి

వనపర్తి , తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం నల్ల చెరువును సందర్శించారు.  పట్టణ ప్రజలకు, ఉదయం, సాయంత్రం కాలి నడక, వ్యాయామం చేసుకునేవిధంగా కట్టను అభివృద్ధి చేయాలని అందుకు అవసరమైన డి.పి.ఆర్.ను సిద్ధం చేసి ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి పై నుండి భారీ వాహనాలు నడవకుండా గేట్ పెట్టాలని సూచించారు. ప్రజలు నడకతో పాటు వ్యాయామం చేసుకునే విధంగా ఓపెన్ జిమ్, పిల్లలు ఆదుకునేందుకు వీలుగా ఆట వస్తువులు, రెండు దిక్కుల అందమైన  మొక్కలు వంటివి ఆభివృద్ధి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్  మహేష్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, వైస్ చైర్మన్ కృష్ణ,  మున్సిపల్ డి. ఈ యునస్, ఏ. ఈ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .