బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి రంగా..
రామచంద్రపురం విగ్రహావిష్కరణ సభలో వంగవీటి రాధా..
ప్రజల కోసం పోరాడే వ్యక్తి రంగా.. ఎమ్మెల్యే రాగమయి
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
వంగవీటి రంగా అంటే ఒక్క కాపు కులానికే కాదని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధా అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో సూదా నరసింహారావు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆదివారం రాత్రి రంగా తరయుడు వంగవీటి రాధా, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దాయనంద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పరితపించే నాయకుడు రంగా అన్నారు.
చిరకాలం గుర్తుండే నేత వంగవీటి రంగా.. ఎమ్మెల్యే
సమాజంలో నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కానీ నిరంతరం గుర్తుండే నేత వంగవీటి రంగా అని సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ అన్నారు. విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బెజవాడ బొబ్బిలి రంగా అన్నారు. తాను చదువుకునే రోజుల్లో రంగా ఆనాడు విజయవాడలో అనేక సమస్యలు పరిష్కరించే వారిని, ఆయన మరణించిన అనంతరం కొందరు ఆ ప్రాంత ప్రజలు రంగా ఉంటే మా సమస్యలు పరిష్కరించే వారిని తనకు చెప్పేవారని ఆమె గుర్తు చేశారు. సందర్భంగా ఆయన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.
తొలుత వంగవీటి రాధాకు కల్లూరు నుండి మున్నూరు కాపు సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ బైక్ ర్యాలీతో రామచంద్రపురం తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు సర్వ నాయకులు ఎడవల్లి కృష్ణ, కట్ల రంగారావు, తోట సుజనారాణి, ఎర్రి నరసింహారావు, పలువురు మున్నూరు కాపు పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


Comments