మృతుల కుటుంబాలను పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు: వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మంగళవారం ఐనవోలు మండల పరిధిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.లక్ష్మిపురం గ్రామానికి చెందిన మడికొండ మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు మామ రాజారపు మల్లయ్య అనారోగ్యంతో మృతిచెందగా, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఐనవోలు మండల కేంద్రంలో శతనాల పుష్పలత, బరిగేల రత్నము, కత్తుల నాగలక్ష్మి మృతిచెందిన సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.పున్నెల్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జిల్లా గోపి దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మేట్ట మహేందర్ గౌడ్, ఎస్టీ సెల్ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నకరకంటి మోహన్, మాజీ ఎంపిటిసి మధు, మండల మహిళా అధ్యక్షురాలు ఇల్లందుల ఎలీషా, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు యాకర సాంబయ్య, మండల అధికార ప్రతినిధి కొతూరి సునీల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగేల భాస్కర్, ఇల్లందుల సారయ్యతదితరులు పాల్గొన్నారు.jpeg)


Comments