అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని ముచ్చేర్ల గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్,డ్రైనేజ్ నిర్మాణ పనులకు  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు,మాజీ జడ్పీ చైర్మన్,వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్  లకావత్ ధన్వంతి శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారిగా అన్ని డివిజన్ల పరిధి లోని విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సంహరించాలని కోరారు.కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరం చేసే విధంగా కృషి చేస్తామన్నారు.అలాగే  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంతన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచామని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను,డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందాన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందని, డిజిటల్ రేషన్, హెల్త్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంచుకునే విషయాన్నీ గుర్తు చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనున్నారని  మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వమని ప్రజలందరూ బిఆర్ఎస్, బిజెపి నాయకుల మాయమాటలకు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ వర్ణగంటి అరుణ, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మానీ శేఖర్ రావు, డివిజన్ అధ్యక్షుడు చిర్ర నరేష్ గౌడ్, దేవరకొండ అనిల్, చిర్ర రాము, ముట్టెడ భరత్,  ఐలయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .