వాసుదేవ్ మ్యూచువల్ సొసైటీ సేవలు మరింత విస్తరించాలి

మేడ్చల్ డిఎంహెచ్‌ఓ ఉమాగౌరి

వాసుదేవ్ మ్యూచువల్ సొసైటీ సేవలు మరింత విస్తరించాలి

నాగారం  తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గంనాగారంమున్సిపాలిటీలో వినియోగదారు లకు చక్కని సేవలందిస్తూ మూడవ బ్రాంచిని ప్రారంభించుకుంటున్న వాసుదేవ్ మ్యూచువల్ సొసైటీ సేవలు మరింత విస్తరించాలని మేడ్చల్ డిఎంహెచ్‌ఓ ఉమాగౌరి అన్నారు. రైతులు,చిన్న వ్యాపారు లు, మహిళలు, ఉద్యోగ విరమణ పొందినవారి కి ఆర్థికభద్రత కల్పించ డమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్న వాసుదేవ్ మ్యూచువల్ ఎయిడె డ్ కోఆపరేటివ్ త్రిప్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మూడవ బ్రాంచి, తమ సేవల విస్తరణ లో భాగంగా రాంపల్లి క్రాస్ రోడ్‌లో మూడవ బ్రాంచిని గురువారం ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేడ్చల్ డిఎంహెచ్‌ఓ ఉమాగౌరి, జనగామ డిఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, వ్యాపారవేత్త రాము యాదవ్, తులసి హాస్పిటల్ జీఎం శ్రీనివాసరెడ్డి, జీనియా హాస్పిటల్ జీఎం డా. పూర్ణచంద్రరెడ్డి, వాసుదేవ్ సొసైటీ చైర్మన్ కావూరి రామారావు, ఎండి వై.నాగేశ్వరరావు, 
సీఈఓ మురళీకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మేడ్చల్ డిఎంహెచ్‌ఓ ఉమాగౌరీ మాట్లాడుతూ. నాగారంలో ప్రారంభమైన వాసుదేవ్ మ్యూచువల్ సొసైటీ అకుంఠిత దీక్ష, పట్టుదల వినియోగదారులకు చక్కని సేవలందిస్తూ మూడవ బ్రాంచిని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, జిల్లాలో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించి ప్రజలకు సేవలందించాలని కోరారు. వాసుదేవ్ సొసైటీ మొదటి శాఖ జిడిమెట్ల, రెండో శాఖ ఉప్పల్‌లో ప్రారంభించి, ఇప్పుడు రాంపల్లిలో మూడో శాఖతో విస్తరిస్తున్నట్టు డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. చైర్మన్ రామారావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 6000 కుటుంబాలకు సేవలందిస్తూ రూ.7 కోట్ల టర్నోవర్ సాధించామని, మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నట్టు పేర్కొన్నారు. 

చిన్న వ్యాపారులకు రుణాల ద్వారా మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. మేము మా శాఖల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక సహయం చేస్తూ వారి కుటంబాలను ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు. అంతేకాక చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారస్తులకు వారి వ్యాపార అభివృద్ధికి రుణాలను మంజూరు చేస్తున్నాము. కావున సభ్యులు మరియు ప్రజలు వాసుదేవ్ సొసైటి సేవలను వినియోగించు కావాలని కోరుకున్నారు. ఎండీ నాగేశ్వరరావు, సీఈఓ మురళీకృష్ణ మాట్లాడుతూ..  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ విరమణ అనంతరం కోఆపరేటివ్ రంగంలో సేవలందించడం గర్వంగా ఉందన్నారు. డిపాజిట్లపై 15% వడ్డీతో పాటు నెలవారీ వడ్డీ అందించే సౌకర్యం ఉందన్నారు. నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ట్టు చెప్పారు. ప్రస్తుతం మూడు శాఖల్లో 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. IMG-20250731-WA0115

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు యు. శ్రీనివాసరావు, ఏరియా మేనేజర్ కె. నాగరాజు, ఏజీఎం సురేష్, బ్రాంచ్ మేనేజర్ రాంబాబు, పి.శేఖర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .