నాగారం మున్సిపాలిటీలో వాహన పూజలు
మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
నాగారం, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలో వాహన పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయం తో పాటు అన్ని వార్డు కార్యాలయాల్లో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సేవలో నిరంతరంగా వినియోగంలో ఉండే వాహనాల భద్రత, సకాలంలో సేవలందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వాహన పూజలు నిర్వహించడం పరంపరగా కొనసాగుతున్నదని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి, రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఇన్‌చార్జ్ తిరుపతి రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాజ్, శానిటేషన్ విభాగం నుండి ప్రదీప్, ఏ. బాబు తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా 20 వార్డుల వార్డు అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు పరిశుభ్రత సిబ్బంది ఈ వాహన పూజల్లో పాల్గొని విజయవంతం చేశారు.


Comments