వెలగపూడి శివరాం ప్రసాద్ మృతి - మాజీ ఎంపీ నామ సంతాపం

వెలగపూడి సురేందర్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన మాజీ ఎంపీ నామ

వెలగపూడి శివరాం ప్రసాద్ మృతి - మాజీ ఎంపీ నామ సంతాపం

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 20,(తెలంగాణ ముచ్చట్లు)

సీనియర్ రాజకీయ నాయకులు, మార్క్ ఫైడ్ మాజీ డైరెక్టర్ వెలగపూడి శివరాం ప్రసాద్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్ సభ పక్షనేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు వెలగపూడి సురేందర్ కు నామ ఫోన్ చేసి మాట్లాడి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ లో ఉన్న నాటి నుండి వెలగపూడి తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామ గుర్తు చేసుకున్నారు. రాజకీయ జీవితం లో వెలగపూడి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారని కొనియాడారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .