కుషాయిగూడ డిపో మేనేజర్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ
కుషాయిగూడ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ఆర్టీసీ డిపోకు కొత్త మేనేజర్‌గా వి. వేణుగోపాల్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ఈ డిపో మేనేజర్‌గా సేవలందించిన మహేష్ కుమార్ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులవడం తో డిపో సిబ్బందిలో కొత్త ఉత్సాహం నెలకొంది.ఈ సందర్భంగా నూతన మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ,డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రయాణికుల సమస్యలు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని,ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.డిపో అభివృద్ధి, ఆదాయ వృద్ధి, ప్రయాణికుల కు ఆధునిక సౌకర్యాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో సిబ్బందంతా సహకరించాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో డిపో సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త మేనేజర్‌ను అభినందించారు. కొత్త మేనేజర్ బాధ్యతలు స్వీకరించడంతో రాబోయే రోజుల్లో కుషాయిగూడ డిపో సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments