ఫలహారపు బండి ఊరేగింపు పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
విఠల్ నాయక్
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఫలహారపు బండి ఊరేగింపు ఉత్సవంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొన్నారు. విటల్ నాయక్ మాట్లాడుతూ- ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డ అంగరంగ వైభవంగా ఫలహారపు బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఫలహారపు బండ్ల ఊరేగింపునకు ఉప్పల్ ప్రత్యేకంకాగా పరమేశ్వర్ రెడ్డి ఫలహారపు బండి ఊరిగింపు అంటే మరింత ప్రత్యేకమన్నారు.
ప్రజాధరణ కలిగిన పరమేశ్వర్ రెడ్డి. మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అమ్మవారిని ప్రార్ధించానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ పూర్ణ యాదవ్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు , మాజీ ఏయంసి మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, డివిజన్ కాంగ్రెస్ నాయకులు జి సత్యనారాయణ, టి శ్రీహరి,శ్రీధర్ రెడ్డి, జి బాల్ రాజ్, ప్రదీప్, కృష్ణ, హరి,గౌతమ్, శ్రీకాంత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.


Comments