కేంద్ర రైల్వే మంత్రి కి వినతి పత్రాన్ని సమర్పించిన వినయ్ భాస్కర్  

కేంద్ర రైల్వే మంత్రి కి వినతి పత్రాన్ని సమర్పించిన వినయ్ భాస్కర్  

 ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు

  ఢిల్లీలోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంగళవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తో కలిసి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బృందం  పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు దాస్యం వినయ్ భాస్కర్ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. నాడు ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, నాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి పార్లమెంటు సభ్యులు, మేము కలిసి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పొందుపరిచేలా కేంద్రంపై ఒత్తిడి చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి కి ఆయన గుర్తు చేశారు. కాజీపేటకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీ పలు రాష్ట్రాలకు తరలిపోయిన తీరును వివరించారు. వివిధ దశలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కలిసి వచ్చే ఉద్యమ శక్తులతో కలిసి చేసిన పోరాటాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవశ్యకతను వివరించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు కావలసిన స్థలాన్ని సైతం కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది అన్న విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. అలాగే కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్స్ స్థాయికి త్వరితగతిన అప్డేట్ చేయాలని ఆయన కోరారు. రైల్వే స్టేషన్ లో కొన్ని రైళ్లు హాల్ట్ జరగాలని, ఫ్లాట్ ఫామ్ ల సంఖ్య పెంచాలని ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని ఆయన విన్నవించారు. వరంగల్ లో  రైల్వే స్టేడియంలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 60 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కాజీపేట ఐటిఐ కాలేజీ విద్యార్థులకు స్థానికంగా అప్రెంటిస్ కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్స్ కట్టించాలని, బోడ గుట్టకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన త్వరగా పూర్తయ్యాలా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు రైల్వే సమన్వయం ఇతర సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు , నార్లగిరి రమేష్, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ,కొండ్ర శంకర్, దువ్వా కనకరాజు, బరిగెల వినయ్, సిరిమల్లె దశరథం, సుంచు అశోక్ ఎండి అఫ్జల్, ఎండి హుస్సేన్, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .