సహాయ చర్యలను ముమ్మరం చేశాము 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సహాయ చర్యలను ముమ్మరం చేశాము 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయ చర్యలను ముమ్మరం చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, సాయినగర్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ, ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, జలగంనగర్, వెంకటేశ్వర నగర్ మున్నేరు వరద ప్రదేశాలలో కొనసాగుతున్న సహాయక పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. వర్షం బీభత్సం కు కూలిన ఇళ్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు, బురదమైన కాలనీలలో కూడా అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ నష్టం అంచనాను కలెక్టర్ గమనించారు. కాలనీలలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు కలెక్టర్ పంపిణీ చేశారు. గత రెండు రోజులుగా అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో వరద బాధితులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలలో పాల్గొన్ని పండ్లు అందించారు. ప్రజలతో మాట్లాడుతూ .. వరద ప్రాంతాలు పూర్వ పరిస్థితిని తెచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి పంచాయతీ ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. వరద ప్రభావం లేని వేర్వేరు గ్రామాల నుంచి రప్పించిన పారిశుధ్య సిబ్బంది కూడా సహాయక పనులలో పాల్గొంటున్నారని తెలిపారు. బయటి ప్రాంతాల నుంచి రప్పించిన వారికి కూడా రిలీఫ్ క్యాంపుల్లోనే వసతి, భోజన సౌకర్యాలనూ ఏర్పాటుచేశామని చెప్పారు. ఒకవైపు వర్షం అప్పుడప్పుడు పడుతున్న పారిశుధ్య కార్మికులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. డోజర్ల ద్వారా రోడ్లపై పేరుకుపోయిన బురదను శుభ్రపరచడం, ట్యాంకర్ల ద్వారా నీళ్లు జల్లడం, అంటువ్యాధులు వ్యాపించ కుండా బ్లీచింగ్ పౌడర్, దోమల ప్రభావం లేకుండా ఫాగింగ్ లాంటి చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ వివరించారు. ఇంతకుముందెన్నాడూ ఈ స్థాయిలో వర్షం పడలేదని. మున్నేరు వరదలతో ఉపశమనం కలుగుతున్న ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. బొక్కలగడ్డ, మంచికంటినగర్ నందు జరుగుతున్న విద్యుత్ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .