ఎగుమతయ్యే ఉత్పత్తులను మరింత పెంచేందుకు అన్ని వసతులు కల్పిస్తాం
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులను మరింత పెంచేందుకు అన్ని రకాల వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎగుమతుల పరిమాణాలను అసోసియేషన్ ద్వారా సేకరించి నివేదిక రూపంలో అందించాలని, ముఖ్యంగా బియ్యం, గ్రానైట్, మిరపకాయలు, టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు.
రైతులు నాణ్యమైన ఉత్పత్తులు అందించి అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచేందుకు అవగాహన కల్పించాలని, అలాగే ఎగుమతి దారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు నివేదికలను సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డీజీఎఫ్‌టీ ఉపసంచాలకులు శైలజ (వర్చువల్‌గా), ఎల్‌డీఎం శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు..jpeg)


Comments