ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల

ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం 

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినప్పటికీ హామీల అమలులో ఘోరంగా విఫలమైందని అన్నారు.

ఈ సందర్భంగా  గుండె విజయరామారావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు, 66 మోసాల తాలుకా కథ. ప్రజలకు ఇచ్చిన సుమారు 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది” అని విమర్శించారు.

ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రజల హక్కులను కాపాడేందుకు, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పందించేందుకు బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ ఇనుగల్ యుగంధర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ బీజేపీ అధ్యక్షుడు చట్ల వెంకటరమణ గౌడ్, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కందుకూరి రజినీకాంత్, బీజేవైఎం నాయకులు రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .