అసైన్ భూముల అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం

కాప్రా తహసిల్దార్ సుచరిత

అసైన్ భూముల అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం

కాప్రా, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడలో అసైన్ భూములపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా తహసిల్దార్ సుచరిత స్పష్టం చేశారు.శుక్రవారం ఆమె కుషాయిగూడ జమ్మిగడ్డ వద్ద ఉన్న అర్చీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని అసైన్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణమే నిర్మాణాలను తొలగించి, భూమికి ఫెన్సింగ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా అధికారులకు ఇటీవల అసైన్ భూములను అక్రమంగా లే అవుట్ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో విచారణ జరిపినట్లు సమాచారం. విచారణలో ఆ భూములు అసైన్ భూములేనని నిర్ధారణ అయింది.తహసిల్దార్ సుచరిత మాట్లాడుతూ, “అసైన్ భూములపై ఎటువంటి నిర్మాణాలు అనుమతించబోవు. చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .