కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా 

కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా 

దమ్మాయిగూడ, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల డబుల్ బెడ్‌రూం కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం కమిషనర్ కాలనీని సందర్శించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీ లీకేజీలు, వీధి దీపాల లోపాలు, చెత్త సేకరణలోఆలస్యం వంటి పలు సమస్యలను వివరించారు. వాటిని శ్రద్ధగా విన్న కమిషనర్ వెంటనే అధికారులను ఆదేశించి చర్యలు తీసుకోవాలని సూచించారు. WhatsApp Image 2025-10-15 at 7.20.15 PM
“కాలనీలో ఎలాంటి సమస్యలైనా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావాలి. ప్రజల సహకారంతో దమ్మాయిగూడను పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కీసర మండల బీజేపీ అధ్యక్షుడు కోళ్ల బాలరాజ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల కృష్ణ యాదవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాం రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .