అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు

అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో రాఖీ పండగ సందర్భంగా మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి రాఖి కట్టి, స్వీట్లు పంపిణీ చేసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్మసమాజ్ పార్టీ నాయకులు హాజరై మాట్లాడుతూ.. 70 కోట్ల మంది మహిళల కి అంబేడ్కర్ కి మించిన అన్నయ్య ఎవరు లేరని,నేడు భారతీయ మహిళా లోకానికి....ఓటు హక్కు,విద్యా హక్కు, ఉద్యోగ హక్కు,మహిళా కార్మిక హక్కు, మహిళా రాజకీయ హక్కు,ఆస్తి హక్కు, వివాహ,విడాకుల హక్కు,ఆర్థిక హక్కు ఇన్ని హక్కులు ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. వంటింటికి బంధీలుగా పురుషుడి పాదాల క్రింద నలిగిపోయిన బానిస గా వున్న స్త్రీ సంకెళ్లను బద్దలు కొట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. అందుకే "మహిళ ల పాలిట దేవుడైన "అంబేడ్కర్ అన్నయ్య" విగ్రహానికి.. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యం లో మహిళలంతా రాఖీలు కడదాం...ఉద్యమాన్ని కొనసాగిద్దాం..రుణం తీర్చుకుందాం.

ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులునత్తి సుధాకర్ మహారాజ్,మాదిగ జాగృతి సంఘం సభ్యులు రామగళ్ళ ఈశ్వరయ్య మహారాజ్,రాములు మహారాజ్,భగవంతు మహారాజ్ నాయకులు గ్రామ మహిళలు చిన్నారులతో కలిసి అంబేడ్కర్ గారి విగ్రహానికి రాఖీలు కట్టడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .