యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బోనాసి క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
Views: 16
On
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే నూతనంగా ఎన్నికైన బోనాసి క్రాంతిని పలువురు యువజన సంఘం నాయకులు జనగామ యువజన కాంగ్రెస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి (స్టేషన్ ఘన్పూర్), శాగంటి మణి (చిల్పూర్),జఫర్ ఘడ్ యువజన కాంగ్రెస్ నాయకులు డానియల్, ప్రతిష్, పాషా, ఉప్పుగంటి రజినీకర్ తదితరులు పాల్గొనారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments