యువజన కాంగ్రెస్ మండల  అధ్యక్షుడు ఇసురం రాజు(కృష్ణ)ను సన్మానించిన ఎంపి,ఎమ్మెల్యే 

యువజన కాంగ్రెస్ మండల  అధ్యక్షుడు ఇసురం రాజు(కృష్ణ)ను సన్మానించిన ఎంపి,ఎమ్మెల్యే 

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

యువజన కాంగ్రెస్ చిల్పూర్ మండల అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన మండలంలోని పళ్ళగుట్ట గ్రామానికి చెందిన ఇసురం రాజు(కృష్ణ)ను స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి,వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య సన్మానించారు.

ఆదివారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హల్ లో జరిగిన  ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశ అనంతరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన యువజన సంఘం ఎన్నికల్లో గెలిచిన యువ నాయకులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య శాలువాలతో  సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ కార్యక్రక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను,కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారికీ సూచించారు.
అంతేకాక కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్,బిజెపిలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .