ఆర్టిఐ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా గుండెల రాయుడు

ఆర్టిఐ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా గుండెల రాయుడు

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,

రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు ఆర్టిఐ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా గుండెల రాయుడు ను నియమించినట్లు 

జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా గుండెల రాయుడు కు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం గుండెల రాయుడు తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్"చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుండెల రాయుడు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్"చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి, బత్తుల మహేష్ గౌడ్ ,మాదగోని శ్రీనివాస్ గౌడ్, బోధాస్ రాజు,జి. భాను ప్రసాద్,ఎండి మున్నా,రింగు ధీరజ్, కొమ్ము రాజు,పందుల రాజు గౌడ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .