కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

 న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......