ఘనపూర్ గడ్డపై రెపరెపలాడిన జాతీయ జెండా
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే ఈ రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న స్వేచ్ఛగా దేశ జెండా రెపరెపలాడిన రోజు.. జాతీయ జెండా ఎగురవేసిన కడియం
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
78వ స్వాత్రంత్య దినోత్సవాన్ని
పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న పరాయి పాలన నుండి భారతదేశం విముక్తి పొందిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ 77సంవత్సరాల్లో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ప్రపంచానికి తలమానికంగా నిలిచిందని తెలిపారు. డా.బీ ఆర్ అంబెడ్కర్ కల్పించిన హక్కులు అన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అన్ని వర్గాలకు అందాల్సిన అవసరం ఉందన్నారు. 78 సంవత్సరాల తర్వాత కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ, అసమానతల వల్ల దేశంలో సమానత్వం సాధించలేకపోతున్నామని అన్నారు. దేశంలో ఇంకా పేదరికం ఉందని, కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యరంగం పైన చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా అందరికీ నాణ్యమైన విద్య ఆందించే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ పర్ ఆల్ అనే నినాదాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో భేటీ పడావో అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తుందని, కానీ దేశంలో భేటీకి రక్షణ లేదని, చదవడానికి సరైన స్కూల్స్ లేవని అన్నారు.
ఆ నినాదంలో ఏమాత్రం నిజాయితీ లేదని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అందించిన రాజ్యాంగా ఫలాలు, జనాభా ప్రతిపాదన సమపాల్లలో అందరికీ చెందాలని చెప్పి షెడ్యూల్ కులాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఇది మనందరం స్వాగతించాల్సిన విషయం అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు నిజమైన పేదవాడికి , అట్టడుగునా ఉన్నవారికి చెందినప్పుడే నేను సంతృప్తి చెందుతానని అప్పుడే అన్నారని, అందుకు అనుగుణంగా తీర్పు వెలువడిందని తెలియజేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి, రైతులను అప్పుల ఊబి నుండి పైకి తీసుకురావాలని వ్యవసాయన్ని పండుగ చేసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే 31 వేల 500 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే రెండు విడుతలుగా రుణమాఫీ జరిగిందని ,నేడు మూడో విడుత రైతు రుణమాఫీ జరగబోతోందని పేర్కొన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అర్హులైన రైతులకు ఏదైనా కారణం వల్ల రుణమాఫీ జరగకపోతే ఆందోళన చెందవద్దని వారందరికీ రుణమాఫీ వర్తింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి ఘనపూర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ వంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండి అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందే విధంగా కృషి చేద్దామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..


Comments