సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడలు మండల స్థాయిలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.

ప్రారంభోత్సవ ప్రసంగంలో నాయకులు, క్రీడల వల్ల శారీరక మరియు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం ద్వారా అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ పుష్ప అధ్యక్షతన, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ ఎస్ఎంసి చైర్పర్సన్ రవి, నరేష్, తహసిల్దార్ సరస్వతి, పెద్దమందడి ఎస్ఐ యుగంధర్ రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్స్, ఉపాధ్యాయులు, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.