68వ ఎస్జిఎఫ్ఐ అండర్-14 హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు 

68వ ఎస్జిఎఫ్ఐ అండర్-14 హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు 

హుజురాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టౌన్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో 68వ ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్-14 బాల బాలికల హాకీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ, యువ క్రీడాకారులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన నిఖిత్ జరీనా, మహమ్మద్ సిరాజ్, జీవాంజి దీప్తి వంటి క్రీడాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి పురస్కారాలతో పాటు నజరానాలు అందజేసిందన్నారు.WhatsApp Image 2024-11-29 at 8.39.38 PM (1)

తన చిన్ననాటి హాకీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, అదే మైదానంలో చిన్నతనంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాకీ విజయం సాధించిన విషయాన్ని వివరించారు. క్రీడాకారుడిగా మొదలైన తన ప్రయాణం పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా మొదలై, చివరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగిందని, ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.

పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు గౌరవించడానికి ప్రయత్నించాలని ప్రేరణ నిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, డీఈఓ, పూర్వ క్రీడాకారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .