మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి
రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టాలి
- సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు అభినందనీయం
- రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలి
- విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు : రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి అన్నారు . సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు వెల్లడించి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని ఆ అధికారం రాష్ట్రాలకే ఉందని ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు . ఎమ్మార్పీఎస్ 7 శాతం రిజర్వేషన్ల కోసమేనా... 30 ఏళ్ల ఉద్యమం చేసింది. ? దీని ప్రకారం కేవలం మాదిగలకు 6 , 7 శాతం కోసమే ఉద్యమం చేస్తే దానికి అర్థంలేదని , తెలంగాణ మాదిగల చిరకాల డిమాండ్ 12 శాతాన్ని అమలు చేయాలన్నారు . అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరగా ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు విద్య, ఉద్యోగ , ఉపాధిలలో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు . పంజాబ్ రాష్ట్రం వేసిన పిటీషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇవ్వడం సంతోషదాయకమన్నారు . ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అన్న మాన్యవార్ కాన్సిరాం ప్రకారం మాదిగలకు సరైన కోట దక్కేందుకు చేసే పోరాటానికి సిద్ధం అవుతున్నామని అందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు . అదేవిధంగా ఈ నెల 11న హైదరాబాదులో జగజ్జీవన్ రామ్ భవనంలో జరిగే "మాదిగ సంఘాల సదస్సును" జయప్రదం చేయాలని కోరారు . ఈ విలేకరుల సమావేశంలో మాదిగ JAC రాష్ట్ర అధ్యక్షులు బొల్లికొండ వీరేందర్ , మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ , కాడాపాక రాజేందర్ , బారిగేలా బాబు , దుప్పటి కిషోర్ , చక్రి , విజయ్ , యలాద్రి , రవి , నవీన్, మహేష్ , ఈ సమావేశంలో పాల్గొన్నారు


Comments