స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా

కో-చైర్మన్‌గా శ్రీనిరాజు..ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు నియమితులయ్యారు.

ప్రముఖ విద్యా వేత్త శ్రీనివాస సి.రాజు గారు ఈ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా, కో-చైర్మన్‌  హోదాలో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆనంద్ మహీంద్రా అటోమొబైల్, ఏయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహీంద్రా గ్రూపు సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు.  

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-ఫసిఫిక్ అడ్వయిజరీ బోర్డు), హార్వర్డ్ గ్లోబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అడ్వయిజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలకు సభ్యుడిగా ఉన్నారు. పద్మభూషణ్ తో పాటు ఆయన అనేక అవార్డులు అందుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలి కాలంలోనే ఆనంద్ మహీంద్రా గారితో సమావేశమైన సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్‌పర్సన్ గా కొనసాగాలను కోరిన విషయం తెలిసిందే. 

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో  స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .