భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

సీఎస్, డీజీపీలను ఆదేశించిన ముఖ్య‌మంత్రి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి గారితో మాట్లాడారు. ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌కు సూచించారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌న్నారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తుతున్న క్రమంలో ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని చెప్పారు.

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేర‌కు సీఎస్ శాంతికుమారి గారు, డీజీపీ జితేంద‌ర్ గారు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .