తెలంగాణ ప్రజల సంస్కృతికి చిహ్నం బోనాలు

 గ్రామ ప్రజలందరికీ పోచమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు ---వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణ ప్రజల సంస్కృతికి చిహ్నం బోనాలు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నేడు అనగా మంగళవారం జరిగే పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి గ్రామం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాడం మాసంలో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావిస్తు... పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని, అత్యంత వైభవంగా బోనాల పండుగ నిర్వహిస్తారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామంలోని పోచమ్మ తల్లికి బోనాల సమర్పించి, భక్తులు మొక్కులు చెల్లించి భక్తిశ్రద్ధలతో సంతోషంగా బోనాల పండుగను జరుపుకోవాలని అన్నారు. గ్రామ ప్రజలందరికీ పోచమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .