మార్కెఫెడ్ ద్వారా అపరాలు కొనుగోలు చేయండి 

-రుణమాఫీ అమలు చేసి హామీని నిలబెట్టుకోండి

మార్కెఫెడ్ ద్వారా అపరాలు కొనుగోలు చేయండి 

 -సెప్టెంబరులో రైతు భరోసా అమలు చేయాలి

-తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా అపరాల కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. అపరాలు పండించిన రైతులు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు వ్యాపారులు కనీస ధరకు కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. రైతు సంఘం సమావేశం గురువారం స్థానిక గిరిప్రసాద్ భవన్లో జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ అపరాల సాగు తగ్గిపోతున్న నేపథ్యంలో -ఆపరాలు సాగు చేసిన రైతులను ప్రభుత్వమే ఆదుకుని మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27న -జరిగిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన రైతాంగానికి రైతు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి హామీని నిలబెట్టుకోవాలని గోవిందరావు సూచించారు. రైతుల్లో ఆందోళన నెలకొందని ప్రభుత్వం ఈ -సమయంలో చిత్తశుద్ధిని చాటాలన్నారు. రైతుభరోసా ఖరీఫ్ అందించలేదని కనీసం యాసంగి పంటకైనా రైతుభరోసా అందించాలని కోరారు. పంటల బీమా, రైతుబీమా, పంటల బోనస్ సక్రమంగా అమలయ్యేందుకు రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యాచరణ చేపడతామని గోవిందరావు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మిడికంటి చిన్నవెంకటరెడ్డి, బానోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .