ప్రపంచ వ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు (CWEIC) కృషి

ప్రపంచ వ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు  (CWEIC) కృషి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని CWEIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ (Rosie Glazebrook) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు Commonwealth Enterprise and Investment Council (CWEIC) కృషి చేస్తోందని, ప్రత్యేకించి చిన్న-మధ్యతరహా పరిశ్రమ (MSME)లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాలు అందిస్తోందని రోసీ గారు తమ CWEIC కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు(RRR), ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన విజన్‌ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల్లో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .