వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలి:రాపర్తి సోమయ్య

వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలి:రాపర్తి సోమయ్య

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

రుణమాఫీ కానీ రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రాపర్తి సోమయ్య తెలిపారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా జఫర్గడ్ బ్రాంచ్ ముందు సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్రాంచ్ మేనేజర్ కి అందజేశారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు రైతు రుణాలు మాఫీ చేయడం లేదని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఏక కాలంలోనే రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా అమలు చేయడం దారుణం అన్నారు. అంతే కాకుండా ఆఖరి విడత రుణమాఫీ రైతులను నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తుందని ,అనేక షరతులు పెడితే ఎలా రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల దగ్గర కొత్త డేటా తీసుకొని రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అదే విధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు.అంతేకాకుండా రైతులకు రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం ఎంత డబ్బులు మంజూరు చేస్తే అన్ని డబ్బులు రైతులకు రుణరూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఏ షరతులు లేకుండా రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేయాలనీ, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య, వేల్పుల పెద్ద రాములు, చిన్న రాములు, మాడరాజు యాదగిరి, వడ్లకొండ రాజు, కొంతం సోమయ్య, వెంకటమ్మ, నక్క సంపత్, ఎండి శంషాద్దీన్, ఎర్ర రవి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .