రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించేవాడిని

-కేఏ పాల్

రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించేవాడిని

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. ప‌ది రోజుల పాటు విదేశాల్లో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి… ఇవాళ ఖాళీ చేతుల‌తో హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చార‌ని పాల్ అన్నారు. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ… “అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఐటీ కంపెనీలు, రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబ‌డులు పెట్టాయా? యూఎస్‌లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. ఒక్క కంపెనీ అయినా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిందా?” అని పాల్‌ ప్ర‌శ్నించారు. “సీఎంలంద‌ర్నీ అమెరికాకు తీసుకుపోతాన‌ని గ‌తంలో రేవంత్ రెడ్డికి చెప్పాను. ఇప్ప‌టికే సీఎంల‌తో అనేక స‌మావేశాలు నిర్వ‌హించాను. అమెజాన్, టెస్లా సీఈవోల‌ను క‌లుద్దామ‌ని చెప్పాను. వారం రోజుల్లో ఆస్టిన్, డ‌ల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌తో పాటు మ‌రిన్ని న‌గ‌రాల‌కు వెళ్దామ‌న్నాను. మాట కూడా ఇచ్చాను. జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాతో రాలేదు. ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు అని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థ‌మైంది” అని కేఏ పాల్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .