జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతికి నామ సంతాపం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆయన పార్టీకి అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినట్లుగా నామ గుర్తు చేశారు. గ్రామీణ యువతను తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉత్తేజపరచడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. బాలకృష్ణా రెడ్డి మరణం పట్ల వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని నామ తెలిపారు.


Comments