ఉభయ జిల్లాల కలెక్టర్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్న ఖమ్మం ఎంపీ రఘురాo రెడ్డి
ఎడతెరపి లేని వానల దృష్ట్యా ప్రజలను అప్రమత్తo చేయాలని సూచన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మూడు రోజులుగా నిరంతరాయంగా వర్షాలుకురుస్తుoడడంతో..ప్రజలను మరిoత అప్రమత్తo చేయాలని ఖమ్మం ఎంపీ రఘురాo రెడ్డి ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు శనివారం, ఆదివారం లలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ లతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం తో తీవ్ర వర్షాలు పడుతుండడంతో చెరువులు, వాగులు ఉప్పొంగి వరద ప్రభావం నెలకొంటున్న దృష్ట్యా.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఖమ్మంలో మున్నేరు పరిధితో పాటు.. అటు భద్రాద్రి లో లోతట్టు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రవాణా నిలిచి.. రాకపోకలు ఆగిపోయిన మార్గాల్లో సత్వరoగా స్పందించాలని ఎంపీ కోరారు. తాను స్వయంగా పలు ప్రాంతాలను సందర్శిస్తానని ఈ సందర్భంగా రఘురాo రెడ్డి అన్నారు.


Comments