కొల్లి నాగభూషణం మరణం సీపిఐ పార్టీ కి పేదలకి తీరని లోటు

 -- భాగం హేమంతరావు

కొల్లి నాగభూషణం మరణం సీపిఐ పార్టీ కి పేదలకి తీరని లోటు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

కొనిజర్ల సిపిఐ మండల నాయకులు ఏఐటీయూసీ అనుబంధ సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొల్లి నాగభూషణం పెద్దగోపతి గ్రామంలో తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకాల మరణం చెందారు మరణ వార్త తెలుసుకున్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రబాబు లు భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగభూషణం అనేక సంవత్సరాలుగా సిపిఐ పార్టీలో నిబద్ధత అంకితభావం గల కార్యకర్తగా భవన నిర్మాణ కార్మికుల నాయకునిగా మత్స్యకార సంఘ సభ్యుల నాయకునిగా కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని వారు కొనియాడారు చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటు తో అకాల మరణం చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారు నాగభూషణం కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నాగభూషణం కు భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు చిన్న కుమారుడు కొల్లి పృథ్వికి ఇటీవలే అగ్నిమాపక శాఖలో ఉద్యోగం పొందియున్నారు కామ్రేడ్ నాగభూషణంకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బిజి క్లైమేట్ ఏపూరి రవీంద్రబాబు తోట రామాంజనేయులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బానోతు భరత్ సిపిఐ మండల కొనిజర్ల వైరా కార్యదర్శులు వేములకొండ రమేష్ యామాల గోపాలరావు జిల్లా నాయకులు పివి రావు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మనిగ కోటేశ్వరరావు బండారు పుల్లయ్య స్వర్ణ రమేష్ కంపసటి వెంకన్న పిట్టల రాంబాబు పాపగంటి సుదర్శన్ తండు సోమయ్య గుగులోతు శ్రీను ఆంగోత్ మంగీలాల్ ఏఐటీయూసీ నాయకులు గొడ్డు గొర్ల శ్రీను,గుడ్డు గొర్ల రాంబాబు, రజాక్ మండల కాంగ్రెస్ నాయకులు వడ్డే నారాయణరావు నల్లమోతు భద్రయ్య తాళ్లూరు చిన్న పుల్లయ్య సిపిఎం జిల్లా నాయకులు తాళ్లపల్లి కృష్ణ యుటిఎఫ్ నాయకులు షేక్ రంజాన్ ఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు కంకణాల అర్జున్ రావు వడ్డే సత్యం గ్రామ పెద్దలు నివాళులర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .