సమాచార హక్కు చట్టంపై అధికారుల నిర్లక్ష్యం
హాసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
హసన్ పర్తి మండల తహశీల్దారు కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మండలంలోన 65వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రేనుకుoట్ల దుర్గాప్రసాద్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితంఅనగా 16/7/24 సమాచార హక్కు కోసం ఎమ్మార్వోకు నాకు కావలసినటువంటి సమాచారాన్ని కోరగా అట్టి దరఖాస్తును ఇన్వార్డులో ఇవ్వమన్నారు. అక్కడున్నటువంటి సిబ్బంది స్టాంపు వేసి రిసీవ్డ్ ఇచ్చారు. 11/9/24 నేటికీ 55 రోజులు కావస్తుందని దరఖాస్తుపై సమాచారం ఇవ్వండి అని సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళగా కంప్యూటర్, రికార్డులు చూసి అసలు దరఖాస్తు ఇన్ వార్డు పుస్తకంలో మీ పేరు పైన ఎలాంటి నమోదుకాలేదని చెప్పగా తదుపరి ఎమ్మార్వో చల్ల ప్రసాద్ ను విచారణ కోరగా ఎమ్మార్వో జిరాక్స్ పేపర్ ఇవ్వండి సంబంధించిన నెంబర్ వేసి ఇస్తాము అన్నారు. అవగాహణ ఉన్నటువంటి మాలాంటి వారికి ఇలా జరిగినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమాచార హక్కు చట్టం పై సంబందిత అధికారులు నిర్లక్ష్యంపై స్పందించాలని కోరారు.


Comments