గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి

  -హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.

గురువారం గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజీపేట పరిధిలోని బంధం చెరువు, హనుమకొండ లోని సిద్దేశ్వర గుండం, హసన్పర్తి లోని పెద్ద చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడేల తో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.

 ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్తు దీపాలను, బ్యారీకేడింగ్ ను ఏర్పాటు చేయాలని, క్రేన్లు, విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పలను సిద్ధంగా ఉంచాలని, వాహనాల రాకపోకలకు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో నిమజ్జన ప్రాంతాలలో ఏర్పాట్లను పూర్తి చేసి విధులను నిర్వర్తించాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో తగిన బందోబస్తు ను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా డిసిపి సలీమా, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .