తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
-జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా, గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ అధికారిణి లకారం ట్యాoక్ బండ్ వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాధలను జానపద పాటలు, బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకొని చైతన్యం పొందారన్నారు. నేటి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శమని, వారిని స్మరించుకుంటు, వారి ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవిన్యూ అధికారిణి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు అమరగాని వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు పెరుగు వెంకటరమణ యాదవ్, దూసరి శ్రీరాములు గౌడ్, కుమిలి శ్రీనివాసరావు, గాలి ఆంజనేయులు, ఆర్జేసి కృష్ణ, కూరాకుల నాగభూషణం, మామిడి వెంకటేశ్వర్లు, మూడు ముంతల సంగరాజు, అమరగాని వెంకన్నగౌడ్, బిచ్చాల తిరుమలరావ్ గౌడ్, బోడపట్ల సుదర్శన్ గౌడ్, గాలి అంజయ్య, మార్కం లింగయ్య గౌడ్, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, లింగాల రవికుమార్, గోపగాని శంకర్ రావు, గద్దె వెంకట్రామయ్య, పి. విజయ్ కుమార్, వల్లెపు సోమరాజు, బట్టిపల్లి వెంకటేష్ గౌడ్, పిండిప్రోలు రామ్మూర్తి, బండి నాగేశ్వరరావు, డా. సురేందర్ గౌడ్, మందా రామారావు, వి. నిరోషా, ఎస్కె. సకీనా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments