వ్యాసరచనలో స్టేట్ ఫస్ట్ శ్రీ ఆదర్శ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించి శభాష్ అనిపించుకున్నాడు నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ విద్యార్థి నవనీత్. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అనుబంధ ప్రజ్ఞా వికాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న జక్కుల నవనీత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకతను వెలుగు తీయడం కోసం వ్యాసరచన పోటీలు శనివారం నిర్వహించినారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాదులో శనివారం చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ముచ్చింతాల్ లో జరిగిన పోటీల్లో 380 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో నవనీత్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణం. ఈ సందర్భంగా శనివారం రాత్రి ముచ్చింతాల్ చిన్న జీయర్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా నవనీత్ ఈ అవార్డును అందుకున్నాడు . ఈ సందర్భంగా నవనీత్ కు ప్రశంసా పత్రంతో పాటు 13వేల నగదు బహుమతిని చిన్న జీయర్ స్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర బాధ్యుడు యాదగిరి శేఖర్ రావు, పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్, ట్రస్మా రాష్ట్ర స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.


Comments