వరద ముప్పు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టండి

-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వరద ముప్పు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టండి

హనుమకొండ:

భారీ వర్షాలు కురుస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద ముంపు ముప్పు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

ఆదివారం వరంగల్ పోతన నగర్ సమీపంలోని భద్రకాళి చెరువు కట్ట వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రమాదం చోటు చేసుకోకముందే చెరువు కట్ట వద్ద ఇసుక బస్తాలతో నివారణ చర్యలు చేపట్టాలని సాగునీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాలను, నిండిన చెరువులు, కుంటలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. మరిన్ని రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలమయమైన లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షితంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

 ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, సాగునీటిపారుదల శాఖ డిఈ హర్షవర్ధన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .