రైతు రుణమాఫీ నిరసనను విజయవంతం చేయాలి
--పెద్దమందడి మండల అధ్యక్షుడు వేణు యాదవ్
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు రుణమాఫీ నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు గురువారం పెద్దమందడిలో చేపట్టబోయే ఉదయం 10 గంటలకు రైతు రుణమాఫీ నిరసనను విజయవంతం చేయాలని పెద్దమందడి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు యాదవ్ అన్నారు.
ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయనందువలన రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిందని వేణు యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా రేపు ఉదయం 10.00గంటలకు పెద్దమందడి మండలం కేంద్రంలో దీక్ష మరియు నిరసన కార్యక్రమం ఉన్నది కావున పెద్దమందడి మండలంలో వివిధ గ్రామాల నుంచి రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Comments