వక్ఫ్ చట్టం యధావిధిగా కొనసాగించాలి
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి
ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్( ఖమర్)*
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.1995 వక్ఫ్ చట్టంలోని పలు నిబంధనలను సవరించాలని కేంద్రం భావిస్తోంది.వక్ఫ్ చట్టం యధావిధిగా కొనసాగించాలని వక్ఫ్ చట్టం సవరణ కు ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీ కి గుణపాఠం చెప్పాలని ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్( ఖమర్) అన్నారు.వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం ముస్లిం మతాన్ని టార్గెట్ చేస్తూ వక్ఫ్ చట్టం సవరణ చేసి మైనార్టీల ఆస్తులు కొల్లగొట్టాలని చూస్తుందని అన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు కలిసి రావాలని సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని కోరారు.ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న నూతన చట్టాల పట్ల బిజెపి పార్టీ వైఖరిని ముస్లిం మేధావులు ముస్లిం సమాజం ఇతర రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.


Comments