భద్రకాళి,కాకతీయ మ్యూజికల్  గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్

-మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తాం

భద్రకాళి,కాకతీయ మ్యూజికల్  గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్

-కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ భద్రకాళి చుట్టూ మాడ వీధుల నిర్మాణం కొరకై,కాకతీయ మ్యూసికల్ గార్డెన్ లో చేపట్టనున్న అభివృద్ది పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, హార్టికల్చర్‌ అధికార్లతో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని, భద్రకాళి జలాశయం ను త్రాగు నీటి జలాశయంగా మారుస్తామని, భద్రకాళి చెరువు ఖబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువుపై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. అలాగే మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తామని వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచామని, ఇప్పటికే దాదాపు 90శాతం పూర్తి అయిందని, త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.  రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్‌ పనులను చేపడుతున్నామని, రెండు మ్యూజికల్‌ ఫౌంటేన్‌లను ఏర్పాటు, వచ్చే సందర్శకులకు వీనుల విందైన సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే ఫౌంటేన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గార్డెన్‌ వెనుకబాగంలో ఒక ఫౌంటేన్‌, మధ్యలో ఒక ఫౌంటేన్‌ ఏర్పాటుచేసేలా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-11-26 at 8.05.09 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!