నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!
అశ్వారావుపేట, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.
తదుపరి చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి, సీతాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనం
తరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు జరిపారు.
ములకలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
చివరిగా అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.


Comments