శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

కుషాయిగూడ, సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ప్రతి రోజు ప్రత్యేక ఆభరణాలతో, భిన్న రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వడం విశేషంగా సాగుతోంది. మూడవ రోజు అమ్మవారు గజ లక్ష్మి రూపంలో అలంకరించబడగా, సదరు రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం నవరాత్రి భక్తి శోభతో నిండిపోయింది.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, మంగళహారతులు నిర్వహించగా, భక్తులు శ్రద్ధగా పాల్గొన్నారు.అలంకరణ కర్తగా వ్యవహరించిన ఏవిఎస్ఎన్ రియల్టర్స్ సంస్థ అధినేత & ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యుడు పల్లె సురేందర్ రెడ్డి తన సతీమణితో కలిసి అమ్మవారి సేవలో పాల్గొని, ఆలయ అభివృద్ధి కోసం రూ.50,000 విరాళంను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మఠం వీరేషంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఆలయ అభివృద్ధి కోసం మా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం త్వరలో మరిన్ని పనులు చేపట్టాలని సంకల్పించాం” అని తెలిపారు.ఈకార్యక్రమం లో ఆలయ మాజీ ధర్మకర్తలు మాదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కోమిరెల్లి సుధాకర్ రెడ్డి, వట్టికూటి లక్ష్మీనారాయణ, నిమ్మ పద్మ, అలాగే అర్చకులు బిటుకూరి లక్ష్మణాచారి, కలకోట వెంకట రమణచార్యులు, ఆరుట్ల నారాయణచార్యులు, వేణుగోపాలచార్యులు, గుంటూరు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య దర్శనాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలు, వేద మంత్రాలు మార్మోగుతూ వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!