అక్రమ నిర్మాణాలపై కమెడియన్ అలీకి నోటీసులు

అక్రమ నిర్మాణాలపై కమెడియన్ అలీకి నోటీసులు

వికారాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

కమెడియన్ అలీకి ఊహించని షాక్ తగిలింది. అక్రమ నిర్మాణాలపై ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ నవాబ్ పేట, ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ : 345 లో మహమ్మద్ అలీ తండ్రి స్వర్గీయ మహమ్మద్ భాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఈ ఫామ్ హౌస్ లో గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈనెల 5న మొదటి నోటీసు జారీ చేశారు. అట్టి నోటీసుకు ఎలాంటి రిప్లై రాకపోవడంతో మళ్ళీ గత నవంబర్ 22 న శుక్రవారం మరో నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతిలొ ఇవ్వాలని తెలిపారు.కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిదమవుతున్నటు సమాచారం. కొందరు తనపై చేస్తున్నారని అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని ఆరోపిస్తున్నారట అలీ. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.