గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్..

గ్రామ పంచాయతీ కార్మికులంటే  ప్రభుత్వానికి అంతా భయమా.

గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్..

* అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

* గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

* గ్రామ పంచాయతీ కార్మికుల వర్కర్స్ యూనియన్ నాయకులు.

మెదక్ జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

టేక్మల్ మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను మంగళవారం  పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో హైదరాబాద్  ఛలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్నికి  సిఐటియు రాష్ట్ర శాఖ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికుల అక్రమ అరెస్టును కార్మికులు మండల గ్రామపంచాయతీ కార్మికుల వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు పెంటయ్య ,నాయకులు సుధాకర్ లు తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ ఇప్పుడు అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కార్మికులు గనక రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తే  మండల వ్యాప్తంగా గ్రామాలు చెత్త చదరంతో అపరిశుభ్రంతో  కంపుకొడతాయని  ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదని గుర్తు చేశారు. ఇప్పటికైనా మండల వ్యాప్తంగా 29 గ్రామపంచాయితీ ల పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులందరినీ ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేసి ప్రభుత్వమే గ్రాండ్ విడుదల చేసి కార్మికుల అకౌంట్లో డబ్బులు వేయాలి కార్మికులందరినీ పర్మినెంట్ చేసి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరికీ ప్రమాద బీమా ప్రభుత్వమే చెల్లించాలని, కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి కార్మికులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా పది లక్షలు వెంటనే చెల్లించాలని, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాలను ప్రజల మద్దతుతో  ప్రజా ఉద్యమాలు నిరవధిక దీక్షలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టేక్మల్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .