నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి 

సత్తుపల్లి ఎస్సై టి.కిరణ్ 

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి 

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని సత్తుపల్లి ఎస్సై టి. కిరణ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వేడుకల సందర్భంగా ఎవరైనా చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలను అమలు చేస్తున్నాం. అందరూ సహకరించి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలి” అని పేర్కొన్నారు.

ఎస్సై కిరణ్ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ప్రత్యేక చర్యలను వివరించారు. “డిసెంబర్ 31న రాత్రి 1:00 గంటలోపు వేడుకలు ముగించాలి. బహిరంగ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించరాదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్తనిఖీల్లోపట్టుబడతారు. తగిన చర్యలు తప్పవు. చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించడం అత్యవసరం” అని హెచ్చరించారు.

అనుమతులమేరకేవేడుకలనునిర్వహించుకోవాలని,ఫైర్‌క్రాకర్స్అధిక శబ్దంతో పాటలు ఉపయోగించవద్దనిఆయనతెలిపారు. “మీ చుట్టూ ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందండి” అని ఎస్సై సూచించారు.వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవడంలోప్రతిఒక్కరిసహకారంఅత్యవసరమని,చట్టాలపరమైన చర్యలగురించిముందుగాజాగ్రత్తగాఉండాలనిఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .