నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్

నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్  సందర్శించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్  స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, డి సి షీట్, సస్పెక్ట్ షీట్‌లు, ఎన్ బి డబ్ల్యూ అమలు, సిసిసి పిటిషన్‌లు పెండింగ్‌ ఆంశాలను పరిశీలించారు.WhatsApp Image 2024-12-17 at 9.11.25 PMఈ సందర్భంగా ఇటీవల వృద్ధ దంపతులను పధకం ప్రకారం  హత్య చేసిన నిందుతులను పట్టుకునేందుకు కేసును చాలెంజ్ గా తీసుకొని చెధించిన పోలీస్ సిబ్బందికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పకడ్బంది ప్రణాళికతో అందుబాటులో వున్న  సాంకేతికన వినియోగించి కీలకమైన హత్య కేసును అనతికాలంలోనే చేధించారని అన్నారు. అదేవిధంగా సరిహద్దు ల నుండి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు.  స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు, రెగ్యులర్ రోల్ కాల్ విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. 
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి , సిఐలు సంజీవ్, మురళి ,  రాజు ఎస్సైలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .